ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఉన్న PACSలలో శనివారం యూరియా పంపిణీ చేయనున్నట్లు MLA హరీశ్ బాబు తెలిపారు. టోకెన్లు తీసుకున్న రైతులందరూ యూరియా తీసుకోవాలని సూచించారు. మోతాదుకు మించి యూరియా వాడవద్దని, నానో యూరియా ద్రావణాన్ని కూడా పిచికారీ చేస్తే సత్ఫలితాలు లభిస్తాయన్నారు.