GDWL: భారీ వర్షాల కారణంగా గట్టు మండలం బోయలగూడెం, లింగపురం మధ్య ఉన్న వాగు వర్షం నీటితో పొంగి పొర్లుతోంది. దీంతో బోయలగూడెం నుంచి అయిజ వైపు వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇందువాసి, బలగెరి గ్రామాల మీదుగా ప్రయాణించాలని గట్టు మండల ఎస్సై కె.టి.మల్లేష్ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం పోలీసులను సంప్రదించాలన్నారు.