NLR: తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం అంగన్వాడీ సెంటర్లో శుక్రవారం పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమణి మాట్లాడుతూ… అధిక పోషక విలువలు, తక్కువ ఖర్చుతో కూడిన ఆహారాన్ని తినాలని సూచించారు. ప్రతిరోజు ఆకుకూరలు తినాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.