GDWL: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ప్రేరణతో మహిళలు ముందుకు సాగి సమాజంలో గుర్తింపు పొందాలని నేడు కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఆమె జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాటం భూస్వాములు, అన్యాయాల మీద గెలుపు మాత్రమే కాకుండా సమాజంలో న్యాయం కోసం పోరాడిందని ఆయన కొనియాడారు.