ASR: చెత్త నుంచి సంపద తయారీ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కొయ్యూరు డిప్యూటీ ఎంపీడీవో ఎం.బాబూరావు కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లకు సూచించారు. శుక్రవారం రాజేంద్రపాలెంలో పంచాయతీ సర్పంచ్ పీటా సింహాచలం, కార్యదర్శులు మౌనిక, రవితో కలిసి సీఆర్పీలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని సూచించారు.