AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. 8 మంది నిందితులకు అక్టోబర్ 6 వరకు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జడ్జి ఎదుట రాజ్ కసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సరిగ్గా వైద్య పరీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. టెస్ట్లు చేసి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.