AP: AUలో విద్యార్థులతో VC చర్చలు సఫలం కావడంతో స్టూడెంట్స్ ఆందోళన విరమించారు. మణికంఠ మృతిపై విచారణ జరుపుతామనీ VC హామీ ఇచ్చారు. DMHO, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, KGH సూపరింటెండెంట్‌తో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. దసరా సెలవులలోగా సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.