ELR: నూజివీడుకి చెందిన జనసేన నేత శనగల నాగరాజు (42) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. నాగరాజు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఉదయమే వ్యానులో వెళ్లి కార్మికులకు చేయవలసిన పనిని నిర్దేశించి బైక్పై తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. సమీపములోని వారు నాగరాజును ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు.