MDK: వనదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మెదక్ జిల్లా సుభిక్షంగా ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. పాపన్నపేట ఏడుపాయల వనదుర్గ భవాని మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో నిర్వాహకులు, అర్చకులు స్వాగతం పలికారు. మెదక్ జిల్లా ప్రజలకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.