VKB: జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో భూగర్భజల మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్టులో ఎక్కువ లోతులో ఉన్న గంగ ఈసారి అదే నెల నాటికి ఏకంగా 4.05 మీటర్లు పైకి వచ్చింది. దీంతో తాగు, సాగునీటికి కష్టాలు తప్పనున్నాయి. ఈ సారి యాసంగి సాగుకు అనుకూలం.. పెరిగిన భూగర్భజలమట్టాలు అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే యాసంగి సాగుకు అనుకూలంగా మారనున్నాయి.