ELR: కూటమి ప్రభుత్వం భీమవరం, ఏలూరు పట్టణాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి రూ. 49.50కోట్లతో ట్రామా కేర్ కేంద్రాల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. ఏలూరులో రూ. 24.75కోట్లతో పనులు ప్రారంభం కాగా, భీమవరంలో పనులు చేపట్టేందుకు ఏపీఎంఎస్ఐడీసీ కార్యాచరణ చేపట్టింది. ఈ కేంద్రాలలో ప్రత్యేక ఐసీయూ, క్యాజువాలిటీ, ఎక్స్ రే, స్కానింగ్, ఆపరేషన్ అందుబాటులో ఉంటాయి.