టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ YVS చౌదరికి మాతృవియోగం కలిగింది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తన తల్లి రత్నకుమారి(88) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచినట్లు తెలిపాడు. చిన్నప్పటి నుంచి తమకు ఏ లోటు రాకుండా, తమ కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నాడు. చౌదరి తల్లి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.