రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ మూవీలు షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం HYDలోని రామోజీఫిల్మ్ సిటీలో వీటి చిత్రీకరణ జరుగుతోంది. రెండు వేర్వేరు లొకేషన్లలో ఈ చిత్రాల కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇక ‘రాజాసాబ్’ను మారుతి, ‘ఫౌజీ’ను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు.