ప్రకాశం: తర్లుపాడు ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. MPDO అన్నమ్మ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, స్వచ్ఛమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సిబ్బందికి సూచించారు.