WGL: వరంగల్లోని రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ లలితా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ఛైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.