KMM: నగరంలోని వైరా రోడ్ నందు డ్రైనేజీలో పేరుకుపోయిన పూడిక తీత పనులను మొదలు పెట్టారు. గ్యాంగ్ వర్క్ పనులను శుక్రవారం మేయర్ పునుకొల్లు నీరజ పరిశీలించారు. శిల్ట్ తొలగింపు పనులు పూర్తయితే శాశ్వత పరిష్కారానికి డ్రైనేజీ సామర్థ్యం పెంచే పనులను చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.