NLG: దేవరకొండలోని శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన అమ్మవారి కుంకుమ అర్చన కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గం ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, దేవాన్ స్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.