AP: శాసనమండలిలో కూటమి, YCP మధ్య వార్ నడిచింది. అసెంబ్లీ ప్రాంగణంలో నూతన భవన ప్రారంభోత్సవానికి మండలి ఛైర్మన్‌ను ఆహ్వానించకపోవడంపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. SC వర్గానికి చెందిన ఛైర్మన్‌ను ఆహ్వానించలేదని ఆరోపించారు. ఛైర్మన్‌కు క్షమాపణ చెప్పాలని YCP సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని SCలకు ఆపాదించవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.