GNTR: వట్టిచెరుకూరు మండలంలోని కుర్నూతల నుంచి ప్రత్తిపాడుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన వ్యర్థాలను పడవేస్తున్నారు. కుర్నూతల సమీపంలో ఉన్న పత్తి మిల్లులు సిబ్బంది జిన్నింగ్ చేసిన అనంతరం వచ్చే చెత్తను రహదారి వెంట పడేస్తున్నారు. చెత్త వేయరాదు అని బోర్డు పెట్టిన అక్కడే వేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు.