KMM: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పూలమాల వేసి నివాళులర్పించారు. మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణా సాయుధ పోరాటంలో ఐలమ్మ గొప్ప స్ఫూర్తి నింపారని, సమానత్వం కోసం ఆమె చేసిన త్యాగాలు తరానికి ఆదర్శమని అన్నారు.