WGL: నర్సంపేట పట్టణంలోని 11వార్డులో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు జరిగే ప్రాంతం ఇది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంతం మొత్తం గుంతలు ఏర్పడి, ఆ గుంతల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు వీలైనంత త్వరగా స్పందించి, ఈ గుంతలు పూడ్చి, ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని స్థానికులు కోరుతున్నారు.