MBNR: కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుండడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ ఎత్తు పెంచితే ఇక్కడ సాగునీటిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దాదాపు 20 లక్షల ఎకరాలపై ఈ ప్రభావం ఉండబోతుందంటూ అధికారులు ఒక అంచనా వస్తున్నారు. నారాయణపేట గద్వాల జిల్లాలపై ప్రభావం పడనుంది.