NGKL: ఈ నెల 29న జిల్లాలో మంత్రుల పర్యటన వల్ల జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం రూ.91.71 కోట్లతో కొండారెడ్డి పల్లి గ్రామంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ గృహ నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లాలో మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.