AKP: పారిశ్రామిక భద్రతకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశ్రామిక భద్రతపై వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రత ఆడిట్ బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.