అన్నమయ్య: జిల్లాలో 10 రోజుల క్రితం టన్ను అరటి ధర రూ.15-18వేలు పలకగా.. ప్రస్తుతం రూ.5 రూ.7వేలకు పడిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ధర లేక..రవాణా ఖర్చులు భరించలేక పండిన పంటను చెట్లకే వదిలేస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పక్క రాష్ట్రాల్లో వర్షాలు, ఇతర కారణాలతో అక్కడి వ్యాపారులు కొనుగోలుకు రావడం లేదని, ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.