ATP: రాయదుర్గం పట్టణానికి చెందిన చాకలి పవిత్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2,50,000 చెక్కు మంజూరైంది. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత్ బాధితురాలికి అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.