ASR: ఆదివాసీ మాతృ బహు భాష ఉపాధ్యాయులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని మాతృ బహు భాష ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సీందేరి జగన్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం సంఘం జిల్లా నేతలు నాగేంద్ర, రమేష్, చిన్నమ్మి తదితరులతో కలిసి పాడేరులో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే చెల్లించాలని కోరారు.