AKP: మహిళల కోసమే ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిణి డాక్టర్ లిఖిత అన్నారు. శుక్రవారం అచ్యుతాపురం మండలం తంతడిలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించేందుకు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధులు నిర్ధారణ అయితే చికిత్స అందిస్తామన్నారు.