మేడ్చల్: కూకట్‌పల్లిలోని వసంత నగర్ సెక్షన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అసిస్టెంట్ లైన్ మెన్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ ఓ వినియోగదారుడి నుంచి ఇంటి వైరు మార్చేందుకు (5kv నుంచి 11kv) రూ.30,000 డిమాండ్ చేశాడు. చివరకు రూ.11,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీకాంత్ గౌడ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.