NGKL: తెలంగాణ వీర వనిత, దైర్య శాలి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ130వ జయంతి వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో కృష్ణయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.