GNTR: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు సహా అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ ఉపకార్యనిర్వహణ అధికారి లీలా కుమార్ తెలిపారు.