అన్నమయ్య: మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల యంత్రాంగంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో వివిధ అంశాలతో పాటు, తాగునీటి సమస్య, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షిస్తారని తెలిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి అధికారులు హాజరు కానున్నారు.