KMM: సెప్టెంబర్ 27న HYD రవీంద్రభారతిలో జరగనున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా చేనేత, జౌళి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను ఆహ్వానించారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ కమర్తపు మురళి మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కందగట్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.