KMM: నకిలీ బంగారం బిస్కెట్ను తక్కువ ధరకే ఇస్తానని మోసం చేస్తున్న అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం 3-టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. ఓ అపరిచిత మహిళ, మరో వ్యక్తితో కలిసి ఓ మహిళను నకిలీ బంగారు బిస్కెట్లు చూపించి 2 తులాల బంగారు గొలుసు, రూ.10 వేలు తీసుకున్నారు. మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది.