E.G: కడియం మండలం కడియపులంకలోని శ్రీ హరి హర మహా క్షేత్రంలో కొలువైయున్న శ్రీ అపర్ణాదేవి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం శ్రీ లక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.