WNP: జమీందారుల దమనానికి ఎదురొడ్డి రైతాంగానికి న్యాయం సాధించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని శుక్రవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని చాకలి ఐలమ్మ 130వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన ఐలమ్మ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక మహిళ గళం కూడా ప్రజా ఉద్యమానికి దారితీస్తుందనే నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు.