KDP: రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో వర్షాల కారణంగా దాదాపు 150 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిన్నట్లు మండల వ్యవసాయ అధికారి శివ రామకృష్ణారెడ్డి తెలిపారు. వరి, పత్తి, కంది తదితర పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు.