SRPT: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాలలో హుజూర్నగర్ ఎమ్మార్వో మందడి నాగార్జున రెడ్డి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (CTO)గా ఉద్యోగాన్ని సాధించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. గతంలో ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూడా సేవలు అందించారు. గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధించిన ఆయన్ని పలువురు అభినందించారు.