SKLM: కూతురి హృదయంలో నాన్న ఎప్పుడూ హీరోనే.. అలాగే తండ్రికి కూతురే లోకం. ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూతురిపై తండ్రి ప్రేమకు నిదర్శనమే పై ఫొటో. గురువారం కొత్తమ్మతల్లి పండగ విధుల్లో ఉన్న శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కూతురిని భుజాలపై ఎక్కించుకుని జాతరలో అందాలను చూపించారు. కలెక్టర్కు తన కూతురిపై ఉన్న ప్రేమను చూసిన పలువురు భక్తులు ముగ్ధులయ్యారు.