దక్షిణ రైల్వే చెన్నై డివిజన్.. IRCTCతో కలిసి అన్ రిజర్వుడు కోచ్లలో ప్రయాణికుల కోసం రూ.20కే ఆహారాన్ని అందించే పథకం ప్రారంభించింది. కానీ, ఇప్పటివరకు ఈ పథకం గురించి కొంతమంది ప్రయాణికులకు తెలియదు. దీంతో చెన్నై సెంట్రల్, చెంగల్పట్టు, ఎగ్మూరు, కాట్పాడి తదితర రైల్వే స్టేషన్లలో చౌక విక్రయ కేంద్రాలు తప్పకుండా ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది.