BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. శుక్రవారం ఉ.8 గంటలకు 41.60అడుగులకు చేరుకుంది. కాగా మరో 2 అడుగుల మేర పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసే అవకాశం ఉంది. 8,72,555 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతుందని అధికారులు తెలిపారు. గోదావరి వరద నీరు పెరుగుతుండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.