WGL: రాయపర్తి శివారులోని పెద్ద వాగు శుక్రవారం ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాయపర్తి-కొండూరు రోడ్డులోని చెరువు మత్తడి జలాలతో పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో, పెద్ద వాగు లో లెవెల్ కల్వర్టును దాటి రోడ్డుపై ప్రవహిస్తోంది. వరద పరుచుకోవడంతో ఇరువైపులా ఉన్న పంట చేనులు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.