NGKL: భారీ వర్షాలకు అతలాకుతలమైన అచ్చంపేట నియోజకవర్గం మర్లపాడు తండా ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం రాత్రి ఆయన తండాలో పర్యటించారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.