PPM: పార్వతీపురం-కూనేరు రహదారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఆంధ్రా-ఒడిశాను అనుసంధానం చేసే ఈ 25 కి.మీ మార్గంలో ఎక్కడికక్కడ గుంతలు ఏర్ప డ్డాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు చేరి అవస్థలు తప్పడం లేదు. అర్తాం, జంఝావతి కూడలి, కోటిపాం, గుమడ మధ్య, కూనేరు గ్రామాల సమీపంలో రోడ్డు దుస్థితి దయనీయంగా ఉంది.అధికారులు స్పందించి రోడ్డు బాగుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.