ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నేపాల్ వైపున మంచులో చిక్కుకుపోయిన ట్రెక్కర్లను రక్షించే క్రమంలో ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మంచు కారణంగా జారిపడి లోబుచే వద్ద కూలిపోయింది. ట్రెక్కర్ల రెస్క్యూ మిషన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.