ADB: భీంపూర్ మండల కేంద్రంలో పంట కొనుగోలు ఏర్పాటు చేయటం పట్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించే కృతజ్ఞతలు తెలిపారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి పంటను అమ్ముకునే తిప్పలు తప్పయని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, యువకులు తదితరులున్నారు.