ఆస్ట్రేలియాతో WC సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89*), జెమీమా రోడ్రిగ్స్ (85*) హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. భారత్ విజయానికి ఇంకా 113 పరుగులు చేయాలి. దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.