AP: భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఇన్ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్తున్న బోటును ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో స్థానిక జాలర్లు అడ్డుకున్నారు.