మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోలను సోషల్ మీడియా నుంచి పోలీసులు తొలగించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్ చేసి, అశ్లీల వీడియోలు సృష్టించగా.. ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడ నుంచి పోస్టు చేశారనే దానిపై విచారణ చేపట్టారు. విదేశాల నుంచి వీడియోలు అప్లోడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ‘ఎక్స్’లో దయా చౌదరి పేరుతో ఉన్న ఖాతాను పోలీసులు బ్లాక్ చేయించారు.