టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో కోచ్గా కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ అతడిని తమ జట్టుకు ప్రధాన కోచ్గా నియమించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.